Vaishali Kidnapping Case : నవీన్ రెడ్డి తల్లి షాకింగ్ కామెంట్స్

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-10 09:25:30  IST  )

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Vaishali Kidnapping Case : నవీన్ రెడ్డి తల్లి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ ఈ ఘటనపై స్పందిస్తూ నా కూమారుడు, యువతి రెండేళ్లుగా స్నేహంగా ఉన్నారని తెలిపింది. అమ్మాయి తమ ఇంటికి చాలా సార్లు వచ్చిందని పేర్కొంది. నవీన్ రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బులను సైతం యువతి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడని తెలిపింది. యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే అయినా గతంలో జరిగిన విషయాలు పోలీసులు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. నవీన్ రెడ్డి ఎంతో కష్ట పడి పైకి వచ్చాడని.. యువతి తన కొడుకుని ఇష్టపడినట్లు తెలిపింది. నవీన్ రెడ్డి తండ్రి కోటిరెడ్డి, నారాయణమ్మలు ఈ ఘటన తర్వాత అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు.

వైశాలి, నవీన్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

Next Story