Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణకు వి.ప్రకాశ్

by Prasad Jukanti |

కాళేశ్వరం కమిషన్ విచారణకు వి.ప్రకాశ్ హాజరయ్యారు.

Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణకు వి.ప్రకాశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh) కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కమిషన్ ఎదుట జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ (V. Prakash) హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వి.ప్రకాశ్.. ఈ విచారణలో 101వ సాక్షిగా తన స్టేట్ మెంట్ ను కమిషన్ రికార్డు చేసుకుందని తెలిపారు. తన వద్ద సమాచారం ఉందని గతంలో తాను కమిషన్ కు ఓస్టేట్ మెంట్, ఓ నోట్ సమర్పించానని వాటి ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిందని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలపై నా వివరణ తీసుకున్నారని తెలిపారు. తమ్మిడి హట్టి నుంచి కాళేశ్వరంకు సైట్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారన్నారు. అలా మార్చడమే మాకున్న ఆధారం అని చెప్పాన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదని, బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర అభ్యంతరాలు వచ్చాయని తెలిపానన్నారు.

మరోవైపు ఇవాళ్టి నుంచి ఏజెన్సీ సంస్థలను సైతం విచారించనుంది. సుందిళ్ల బ్యారేజ్‌ను నిర్మించిన నవయుగ కంపెనీ విచారణకు హాజరుకాబోతుండగా శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్ అండ్ టీ, శనివారం అన్నారం బ్యారేజీ నిర్మాణం చేపట్టిన ఆప్కాన్ సంస్థలు విచారణకు హాజరుకానున్నాయి. నిన్న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరు కాగా ఆయన సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా కమిషన్ ప్రశ్నించింది. ఇవాళ్టి నుంచి ఏజైన్సీ సంస్థలను ప్రశ్నిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Next Story