రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు.. కీలక నేత జోస్యం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజకీయ జీవితంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు.. కీలక నేత జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజకీయ జీవితంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కులగణన జరిగితే, తప్పకుండా రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నేతలు కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా, ఇప్పటికే కులగణనకు (Caste Census) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోడీ ప్రభుత్వ సంకల్పమని కేంద్రమంత్రులు చెప్పారు. ఏప్రిల్‌ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొవిడ్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Next Story