- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజమైన బీసీ పక్షపాతి ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలుస్తది.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt), తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంత రావు(V. Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt), తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంత రావు(V. Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP)కి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు అమోదించాలని అన్నారు. 50 శాతం సీలింగ్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇద్దరు బీసీలు కొట్టుకుంటే.. ఓసీకి కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. బీసీలపై అంత వివక్ష చూపిస్తున్న ప్రధాని మోడీ.. బీసీ బిల్లును ఆమోదిస్తారా? అని అనుమానం వ్యక్తం చేశారు. నిజమైన బీసీ పక్షపాతి ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలుస్తుందని అన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో సాధించలేని చాలా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందని అన్నారు.
తాను సమన్వయంతో వెళ్లడంవల్లే కేసీఆర్‌కు పదేళ్లలో సాధ్యంకాని ఎన్నో పనులను కేంద్రం నుంచి సాధించుకోగలిగామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు తాము అమలు చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టే విషయంలో, బీసీలకు రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో రాష్ట్రానికి తీరనిద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 720 టీఎంసీలకు బదులు 1,200 టీఎంసీలు వాడుకున్నా కేసీఆర్ పదేళ్లపాటు పట్టనట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు.






