V Hanumantha Rao: 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలి : వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-10-16 15:36:41  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

V Hanumantha Rao: 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలి : వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపే ఎన్నికలు జరుగనున్నా పర్వాలేదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే (Elections) ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం బేగంపేటలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18 వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఓ అడుగు ముందుకు వేసి అన్ని పార్టీలతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని వీ.హెచ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ స్పందించాలని రిక్వెస్ట్ చేశారు. తాను ఓబీసీని అని చెప్పుకునే మోడీ బీసీ బిల్లుని ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఇదే సరైన సమయం అని, బంద్‌కు వ్యాపారస్తులు, వివిధ వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story