- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ ఎఫ్ఫైర్స్ పక్కన పెట్టండి.. కానీ భర్తలను చంపకండి: వీహెచ్ హాట్ కామెంట్స్
by Ramesh Naini |
పూర్వం భార్యలు (wife kills husband) భర్తలను కాపాడండి అని దేవుళ్లను వేడుకునేవారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పూర్వం భార్యలు (wife kills husband) భర్తలను కాపాడండి అని దేవుళ్లను వేడుకునేవారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (V Hanumantha Rao) అన్నారు. కానీ ఇప్పుడు భార్యలే భర్తలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి చెడు సంప్రదాయం దూరం చేయాలని ఆయన అన్నారు. భార్యాభర్తలు కలిసి జీవించాలని, భార్యలు భర్తపై ప్రేమ చూపించాలని, అలాగే పిల్లలు తల్లిదండ్రులపై ప్రేమ చూపించాలని అప్పుడే ఫ్యామిలీ బాగుంటుందని చెప్పారు. లవ్ ఎఫ్ఫైర్స్ పక్కన పెట్టాలి.. ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోండి కానీ, తల్లిదండ్రులను చంపకండి, భర్తలను చంపకండి.. అని వీహెచ్ పిలుపు నిచ్చారు. హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో దానిపై నేను మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాస్తానని వీహెచ్ స్పష్టం చేశారు.
Next Story






