VH: గాంధీ లేకుంటే మీ వికసిత్ భారత్ ఎక్కడిది.. కేంద్రం తీరుపై వీహెచ్ ఆగ్రహం

by Prasad Jukanti |   (  Updated:2025-12-21 06:19:59  IST  )

వీబీ-జీ రామ్‌ జీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం పేదలకు అన్యాయం చేస్తోందని వీహెచ్ ధ్వజమెత్తారు.

VH:  గాంధీ లేకుంటే మీ వికసిత్ భారత్ ఎక్కడిది.. కేంద్రం తీరుపై వీహెచ్ ఆగ్రహం
X
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లు తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, ఆత్మహత్యలను తగ్గించడంలో సహాయపడిన పథకాన్ని కేంద్రం బలహీన పరుస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన ఆయన.. నరేగా స్థానంలో వీబీ-జీ రామ్‌ జీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం పేదలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని నీరుగార్చిందని మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని ఆరోపించారు.
దేశంలో ప్రజల ఆకలి చావులు చూసి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నరేగా పథకాన్ని ప్రవేశపెడితే 20 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం రాముడి పేరుతో ఈ పథకంలో మార్పులు చేస్తోందని మండిపడ్డారు. మహాత్మగాంధీ పేరును తొలగించి విక్షిత్ భారత్‍ను చేర్చారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తేకపోతే వికసిత్ భారత్ సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. ఈ స్కీమ్ లో మార్పులు పేదలకు ప్రయోజనం చేకూర్చే బదులు వారికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Next Story