- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకు లక్ష రూపాయలు వాళ్లకు ఇచ్చేస్తా.. వీహెచ్ గొప్ప మనసు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (బీసీ సంక్షేమం & అభివృద్ధి)గా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ హోదాతో వీహోచ్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (బీసీ సంక్షేమం & అభివృద్ధి)గా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ హోదాతో వీహోచ్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వీహెచ్ కీలక ప్రకటన చేశారు. తనకు పదవి బాధత్యలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు నెలకు లక్ష రూపాయల జీతం వస్తుందని, రెండు సంవత్సరాలు తన పదవి ఉంటుందని చెప్పారు. తన రెండేళ్ల జీతాన్ని కూడా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు అందించేలా ట్రస్టులకు ఇస్తానని చెప్పారు. తాను ఏది అడిగినా కాంగ్రెస్ పార్టీ కాదనలేదని అన్నారు.ఖమ్మం నుండి పార్లమెంట్ టికెట్ కావాలని అడిగితే తనపై అభిమానంతో రాజీవ్ గాంధీ రెండుసార్లు టికెట్ ఇచ్చారని చెప్పారు.
ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ పీఎంగా రెండుసార్లు ఆ ప్రాంతానికి వచ్చాడన్నారు. తరవాత పీఎంగా లేనప్పుడు కూడా వచ్చాడని తెలిపారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తరవాత కూడా తనను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందని అన్నారు. రాహుల్ గాంధీ కులగణనను గ్రామగ్రామానికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలో సీఎం రేవంత్ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. మే 10 లోపు కులగణనలో ఓబీసీని చేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. తనకు పార్టీలు మారే అలవాటు లేదని, ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటానని చెప్పారు.






