- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యారియా కొరత వస్తే సహించేది లేదు: మంత్రులు తుమ్మల, ఉత్తమ్
రాష్ట్రంలో మూడు రోజుల పాటు బీజేపీ నేతలు చేపట్టింది రైతు భరోసా యాత్ర కాదని, అధికారం కోసం చేపట్టి యాత్ర అని, ఆపార్టీ నేతలు రైతుల కోసం డిల్లీ యాత్రలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మూడు రోజుల పాటు బీజేపీ నేతలు చేపట్టింది రైతు భరోసా యాత్ర కాదని, అధికారం కోసం చేపట్టి యాత్ర అని, ఆపార్టీ నేతలు రైతుల కోసం డిల్లీ యాత్రలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సీజన్‌కు వరి ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా స్వీకరిస్తున్న బియ్యం పరిమాణాన్ని తగ్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం దిగుబడిలోనే కాకుండా కొనుగోళ్లలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు తుమ్మల, మహ్మమద్అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ఎంపీ రఘరాంరెడ్డి, తూడి దేవేందర్రెడ్డితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దేశంలో అతిపెద్ద ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు రాష్ట్రంగా తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం తో పోల్చి చూసినప్పుడు తెలంగాణా రాష్ట్ర భాగస్వామ్యం 60 శాతానికి చేరుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, పక్క రాష్ట్రాలంటే ముందంజలో ఉన్నామని, ఏపీలో సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరగ్గా, తెలంగాణ ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి 52 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ లక్ష్యాన్ని అధిగమించి 60 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లను పూర్తి చేసిందన్నారు. ఈ యాసంగి సీజన్‌లో 64.36 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.వర్షాకాలం ప్రారంభానికి ముందే కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రైతుల ఖాతాలో రూ.11,050 కోట్లు జమ :
ధాన్యం కొనుగోళ్ల కోసం 8,575 కొనుగోలు కేంద్రాలు, 13 వేల రవాణా వాహనాలు, 2.50 లక్షలకు పైగా సిబ్బందిని ప్రభుత్వం వినియోగించిందని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.11,050 కోట్లు నేరుగా జమ చేశామని తెలిపారు. ఖరీఫ్, యాసంగి కలిపి సీజన్‌లో రైతులకు చెల్లింపులు, కొనుగోళ్లు, రవాణా తదితర కార్యకలాపాలపై దాదాపు రూ.39,300 కోట్ల వ్యయం జరుగుతోందన్నారు. అకాల వర్షాలతో తడిసిన 10,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులకు నష్టం జరగకుండా కాపాడామని, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు పూర్తి మద్దతు అందిస్తామని చెప్పారు.
రైతుల వద్దకు వెళ్లే హక్కు బీజేపీ నేతలకు లేదు : మంత్రులు తుమ్మల, పొన్నం
ధాన్యం, మొక్కజోన్న, జోన్న, పొద్దు తిరుగుడు పంటలకు కేంద్రం సహకరికుండా కేంద్రం రైతులను అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. దేశంలో ఏరాష్ట్రంలో మొక్కజోన్న, జొన్న కొనుగోలు జరిపిన దాఖాలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రమే కేంద్రం పరమితి విధించిన రైతుల బాధలు అర్ధం చేసుకోని మిగతా పంట సేకరిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రేరేపిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు జరుగుతున్నాయని, రైతులు తీసుకొచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు మరింత ధాన్యం కొనుగోలు కోటా, ఎఫ్‌సీఐ స్వీకరణ లక్ష్యాలను పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ప్రసంగిస్తూ సచివాలయంలో బీఆర్ఎస్ నేతలు రైతులు ధర్నా లు చేస్తే ఐదుగురు రావడం లేదనీ మనమే కార్యకర్తలు నిరసనలో పాల్గొని మిలిటెంట్ ఉద్యమం చేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.బీజేపీ నేతలు రైతు ఘోష యాత్ర కాదని, ఢిల్లీ వెళ్లి పెట్రోల్ గోస యాత్ర చేయాలని, యూరియా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రాకుండా చూసే బాధ్యత బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలదే నన్నారు. డిమాండ్ కి తగిన విధంగా ఎరువులు సరఫరా చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాఖలాలు లేవన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల నుండి మిల్లులకు వాహనాల ఇబ్బందులు లేకుండా రోడ్ల పై ఉండి వాహనాలు తీసుకొని ధాన్యం తరలిస్తున్నామన్నారు.






