ఉత్తమ్ జీ.. మీరు స్పీకర్‌కు రాసిన ఉత్తరం గుర్తుందా? హరీశ్‌రావు సూటి ప్రశ్న

by Ramesh Naini |

ఉత్తమ్ జీ.. టీపీసీసీ అధ్యక్షుడిగా 30-03-2016 న మీరు స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

ఉత్తమ్ జీ.. మీరు స్పీకర్‌కు రాసిన ఉత్తరం గుర్తుందా? హరీశ్‌రావు సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తమ్ జీ.. టీపీసీసీ అధ్యక్షుడిగా 30-03-2016 న మీరు స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా గతంలో సీఎల్పీ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం చేసిన లేఖలను పోస్ట్ చేశారు. ‘‘అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము’’ అని.. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్‌కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.. అని హరీశ్ రావు విమర్శించారు. ఈ ఉత్తరంపై నేటి ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క, పద్మావతి కూడా సంతకాలు చేశారని తెలిపారు.

ఈ ఒక్క ఉత్తరం చాలు..

ఈ ఒక్క ఉత్తరం చాలు కాంగ్రెస్ పార్టీ అనైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు వల్లెవేస్తారు.. అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారు.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అని ఆయన అన్నారు. స్పీకర్‌ని బీఏసీ సమావేశంలోనూ, ఉత్తరం ద్వారా కూడా, అధికార పక్షానికి ప్రెజెంటేషన్‌కు అనుమతి ఇస్తే, బీఆర్ఎస్‌కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, ఆ అభ్యర్థనను తిరస్కరించారన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న అసలు తేడా అని అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడవడాన్ని తన “మార్పు”గా చూపిస్తోందని అన్నారు. ఆ “మార్పు” అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story