- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమ్మిడిహట్టి, దేవాదుల పూర్తి చేసేది మేమే : ఉత్తమ్
తుమ్మిడిహట్టి ప్రాజెక్టును, దేవాదుల పంపుహౌజును పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : తుమ్మిడిహట్టి ప్రాజెక్టును, దేవాదుల పంపుహౌజును పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గల దేవాదుల పంపుహౌజును పరిశీలించారు.దేవాదుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం చంద్రబాబు కావాలని పక్కన పెట్టారని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు.
కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్ధ కేసీఆర్ తమ్మిడిహట్టి మీద పెట్టలేదని.. కమీషన్లు దక్కే వాటిపైనే గత ప్రభుత్వం ఫోకస్ చేసి, మిగతా వాటిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేవాదుల, తమ్మిడిహట్టి ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిందని... ఆ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసేది తామేనని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేసారు.






