గల్ఫ్‌లోని కోటి మంది భారతీయుల భద్రత ఆందోళనకరం: ఒవైసీ

by Gantepaka Srikanth |

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేయడాన్ని ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

గల్ఫ్‌లోని కోటి మంది భారతీయుల భద్రత ఆందోళనకరం: ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేయడాన్ని ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు తక్షణమే ఆపాలి డిమాండ్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య అనైతికం, చట్టవిరుద్ధం అని అన్నారు. ఇరాన్‌లో 200 మందికిపైగా మృతి చెందడం బాధాకరమని తెలిపారు. గల్ఫ్‌లోని కోటి మంది భారతీయుల భద్రత ఆందోళనకరం.. ప్రధాని మోడీ స్పందించి వారికి సురక్షితంగా దేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Next Story