- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపాక్‌లో ఉర్విల్ పటేల్ ఊచకోత.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026 మరో సంచలనం నమోదైంది. చెన్నై బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన చెన్నై మొదట బౌలింగ్ ఎంచుకోగా, లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి ఇన్నింగ్స్ స్కోరును 200 దాటించాడు. మరోవైపు షాబాజ్ అహ్మద్ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఉతికారేస్తున్న చెన్నై బ్యాటర్లు..
204 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో ప్రారంభించింది. రెండో వికెట్‌గా వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 54 పరుగులు చేసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే 7.1 ఓవర్ల ముగిసే సమయానికి చెన్నై 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. చెన్నై విజయం సాధించాలంటే ఇంకా 12.5 ఓవర్లలో 92 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (29), ఉర్విల్ పటేల్ (54) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.






