Tummala: అంతా వారి వల్లే.. యూరియా కొరతపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-03 06:04:23  IST  )

యూరియా కొరతపై మంత్రి తుమ్మల స్పందించారు.

Tummala: అంతా వారి వల్లే.. యూరియా కొరతపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) విమర్శించారు. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోయారని దాంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత (Urea Shortage) ఉందన్నారు. ఆ ప్రభావం తెలంగాణపైనా ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తుమ్మల.. ఆగస్టులో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, సెప్టెంబర్ లో రావాల్సిన యూరియా ఇంకా రాలేదన్నారు. యూరియా విషయంలో కేంద్ర మంత్రి నడ్డాని పదే పదే విజ్ఞప్తి చేశాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. అయినా వారు చెప్పినంత కూడా సరఫరా చేయలేకపోయారన్నారు. నాలుగు నెలలుగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పని చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు సెప్టెంబర్ చాలా కీలకం అని అన్ని పంటలకు ఈ నెలలోనే యూరియా వేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెలాఖరుకల్లా కేంద్రం ఇస్తున్న యూరియా ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరుకల్లా 2.8 లక్షల టన్నుల యూరియా కోరుతున్నామన్నారు.

ఇవాళ జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేత, వ్యవసాయ పని ముట్లపై జీఎస్టీ లేకుండా చేయాలని కోరబోతున్నామన్నారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రోడ్లు, మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయని వాటికి పరిహారం, గతేడాది ప్రకటించిన పంట, ఆస్తి నష్టం పరిహారం విషయాన్ని కేంద్రాన్ని కోరుతామన్నారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై కేంద్ర మంత్రితో చర్చిస్తామని కొత్తగూడెంలో సాధ్యం కాకపోతే మరో స్థలం ఎఁపిక చేయాలని కోరుతామన్నారు. ఆయిల్ పామ్ దిగుమతిపై సుంకాలు 40 శాతానికి పెంచాలని కోరబోతున్నామన్నారు.

Next Story