- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Urea: స్థానిక ఎన్నికల వేళ యూరియా కొరతపై పొలిటికల్ ఫైట్.. బీఆర్ఎస్, బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్ చెక్ పెట్టేనా?
యూరియా కొరత వేళ రాష్ట్రంలో కొత్త ట్రెండ్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో యూరియా కొరత (Urea shortage) అంశం రాజకీయ కాక రేపుతోంది. రైతులను ఆదుకోవాల్సిన అధికార పక్షం పూర్తిగా విఫలం అయిందంటూ బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తుంటే కేంద్రం వివక్ష చూపడం వల్లే యూరియా కష్టాలు వచ్చాయని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. కేంద్రం హామీ ఇచ్చిన మేరకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ వారంలోనే సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయగా.. అసలు రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని కాంగ్రెస్ (Congress) సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోందని, యూరియా బఫర్ స్టార్ గురించి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ రామచందర్ రావు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తెల్లవారకముందే యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇదేనా కాంగ్రెస్ తెస్తామన్న మార్పు అంటూ బీఆర్ఎస్ (BRS) విమర్శిస్తోంది. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సిన వేళ స్టేట్ పాలిటిక్స్ లో యూరియా కొరతపై పార్టీల మధ్య ఈ యుద్ధం రాజకీయ వేడిని రాజేస్తోంది.
సోషల్ వార్:
యూరియా కొరతపై తాజాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. తలెత్తిన యూరియా సమస్యకు కారణం మీరంటే మీరు అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సామాజిక మాధ్యమాల్లో బిగ్ ఫైట్ నడుస్తోంది. విస్తారమైన వర్షాలతో పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన అన్నదాతలు యూరియా కోసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారని ఇది అభయహస్తం కాదు.. రైతున్నల పాలిట భస్మాసుర హస్తం అయిందని కాంగ్రెస్ పై గులాబీ పార్టీ ఎటాక్ చేస్తుంది. గతంలో కేసీఆర్ ముందుచూపుతో అన్ని శాఖలను, అధికారులను సమన్వయం చేసుుకుని రైతులకు యూరియా అందించారని వీడియోలను షేర్ చేస్తోంది. అయితే ఓ సారి మీ ప్లాష్ బ్యాక్ గుర్తుచేసుకోండి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యూరియా కొరతపై మీడియాలో వచ్చిన కథనాలను కాంగ్రెస్ షేర్ చేస్తూ ఎదురు ఎటాక్ చేస్తోంది. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతల కండ్లు ఆకాశంలో ఉంటే ప్రతిపక్షంలోకి రాగానే పాతాళంలోకి పడిపోయాయని అందువల్ల గతంలో మీ హాయంలో రైతుల పడిగాపుగాచిన వీడియోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో యూరియా సరఫరాపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియాలో వార్ రాజకీయాన్ని రవసవత్తరంగా మారుస్తోంది.
కొత్త ట్రెండ్:
ప్రస్తుతం రకరకాల ట్రెండ్ లు పుట్టుకు వస్తుండగా తాజాగా యూరియా కొరతపై కూడా ఓ నయా ట్రెండ్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో తమ స్నేహితుల పిట్టిన రోజులకు తోటి రైతులు యూరియా బస్తాను బహుమతిగా ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తేరుకోకుంటే తిప్పలే!:
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటువంటి సమయంలో యూరియా కొరత అంశం రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ చాలెంజ్ గా మారింది. ఓ వైపు రైతుల ఇబ్బందులకు సంబంధించిన వీడియోలను ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుంటే అధికార పక్షం అందుకు తగ్గట్టుగా తిప్పికొట్టలేకపోతుందనే విమర్శలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి. ముఖ్యమంగా యూరియా కొరతకు అసలు సమస్య ఏమిటో వివరించడంలో అధికార పక్షం తేరుకోకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా తెచ్చేవారికే ఓటు వేస్తామంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా తిప్పికొట్టబోతున్నది? ఈ ఇష్యూ రాబోయే లోకల్ ఎన్నికల్లో ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నది అనేది వేచి చూడాలి.






