యూపీఎస్ ఆమోదయోగ్యమైన స్కీం కాదు! పెన్షన్ ఉద్యోగుల సంఘం

by Geesa Chandu |   (  Updated:2024-08-27 15:55:29  IST  )

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన యునిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) వివాదాస్పదంగా మారిందని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరి పెన్షన్ ఉద్యోగుల సంఘం(టీఎస్సీపీఎస్ఈయూ)రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పున్న సోమనాధ్ డిమాండ్ చేశారు.

యూపీఎస్ ఆమోదయోగ్యమైన స్కీం కాదు! పెన్షన్ ఉద్యోగుల సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన యునిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) వివాదాస్పదంగా మారిందని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరి పెన్షన్ ఉద్యోగుల సంఘం(టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పున్న సోమనాధ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. యూపీఎస్ విధానం ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన స్కీం కాదని తెలిపారు. యూపీఎస్ పద్ధతి ఉద్యోగుల పెన్షన్ సంబంధిత అవసరాలను పూర్తిగా తీర్చలేని విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ స్కీమ్ ఉద్యోగులకు యథార్థంగా సరిపోయే పింఛన్లు అందించడంలో అసమర్థంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల దారిద్య్ర నివారణ మరియు భవిష్యత్తు ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టకుండా పనిచేస్తుందని, ఉద్యోగుల నిజమైన అవసరాలను ప్రామాణికంగా తీర్చడంలో విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సరైన మరియు సమర్థమైన విధానాలు అవసరమన్నారు. ఈ నేపధ్యంలో యూపీఎస్ నాణ్యత మరియు ఉద్యోగుల ఆర్థిక భద్రతపై పూర్తి పరిశీలన జరిపి, ఉత్తమ పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Next Story