యూరియా కొరతపై మండలిలో రచ్చ.. సమావేశాలను బహిష్కరించిన BRS ఎమ్మెల్సీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 08:53:49  IST  )

శాసనసభ మాదిరిగానే శాసన మండలి కూడా అధికార, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలతో దద్దరిల్లింది.

యూరియా కొరతపై మండలిలో రచ్చ.. సమావేశాలను బహిష్కరించిన BRS ఎమ్మెల్సీలు
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనసభ మాదిరిగానే శాసన మండలి కూడా అధికార, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఇవాళ సభలో రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage), రైతుల ఇబ్బందులపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) పట్టుబట్టింది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శాసనమండలి శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రబీ సీజన్ ప్రారంభమైన వేళ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్’ వల్ల క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాసనసభతో పాటు శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు మైకులు కట్ చేస్తున్నారని, ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విన్నవించారు.

రాజకీయ లబ్ధి కోసమే BRS అసత్య ప్రచారాలు.. మంత్రి తుమ్మల

ఇక మరోవైపు, రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనపు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తూ సభను అడ్డుకుంటోందని ప్రభుత్వం విమర్శించింది.

Next Story