Upasana: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన కొణిదెల.. ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన కొణిదెల బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి చాటారు.

Upasana: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన కొణిదెల.. ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన కొణిదెల (Upasana Konidela) బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి చాటారు. తెలంగాణ పండుగను దేశ రాజధానిలో సీఎం రేఖా గుప్తా (Rekha Gupta), తెలుగు విద్యార్థులతో కలిసి ఉపాసన (Bathukamma) బతుకమ్మ ఆడారు. ఢిల్లీలోని తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (Telugu Students Association Delhi), తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో (Ramjas College) రాంజాస్ కలశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్యఅతిథులుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల హాజరై సందడి చేశారు. ఢిల్లీ సీఎం, స్టూడెంట్స్‌తో కలిసి ఉపాసన బతుకమ్మ ఆడిపాడారు. ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.

ఈ సందర్భంగా రాంజాస్ కాలేజ్ విద్యార్థులకు, సీఎం రెఖా గుప్తా‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండుగ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ‘దేవి’ని సత్కరించుకొని, మన బలాన్ని కలిసి జరుపుకుందాం.. అని పేర్కొన్నారు. రేఖా గుప్తా జీ, మీరు ఒక అద్భుతమైన సీఎం.. తెలంగాణ సంస్కృతిని ఆప్యాయంగా ఆహ్వానించి, బతుకమ్మ పండుగను మాతో కలిసి జరుపుకున్నందుకు ధన్యవాదాలు.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్వీట్ కోసం క్లిక్ చేయండి..

Next Story