- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అకాల వర్షం.. తడిసి ముద్దయి కొట్టుకుపోయిన వరి ధాన్యం
by Sathputhe Rajesh |
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది.

X
దిశ, రాయపర్తి : అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది. శనివారం ఉదయం కురిసిన అకాల వర్షంతో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయి కొట్టకపోవడం చూసి రైతులు ఆవేదన చెందారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో అప్పులు తెచ్చి గంపెడు ఆశలతో వ్యవసాయం చేసి తీరా వడ్లను ఆరబోసుకొని అమ్ముకోవాలని చూసిన రైతులకు అకాల వర్షంతో రైతులకు నిరాశ చెందుతున్నారు. మామిడి రైతుల సైతం ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈరోజు కురిసిన వర్షానికి మామిడి వరి పండించిన రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






