అప్పటి వరకు మా పోరాటం ఆగదు.. విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీసీ రిజర్వేషన్ బిల్లుల (BC Reservation Bills) ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగింది.

అప్పటి వరకు మా పోరాటం ఆగదు.. విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ బిల్లుల (BC Reservation Bills) ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు సిన్నద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. మరోవైపు ఆయా జిల్లా నుంచి కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ధర్నాలో పాల్గొనేందుకు రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చఏశారు. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన బీసీ పోరుకు బీసీ సంఘాలు, ఎన్జీవో సంఘాలు కూడా మద్దతు తెలిపాయని ఆది శ్రీనివాస్ అన్నారు.

Next Story