- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వర్షం పడే ఛాన్స్
by Malleboina Mahesh |
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆకాశంలో గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో సంభవిస్తున్న మార్పుల కారణంగా రాబోయే ఐదు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే క్యూమ్యూలో నింబస్ మేఘాల కారణంగా కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయి. కొన్ని చోట్ల గంటకు 40-50 కి మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రదేశాల్లో క్రికెట్ బాల్ సైజులో వడగళ్లు పడే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పగటి పూట సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని.. వీటి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.
Next Story






