- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jatara 2026: అందమే అసూయ పడేలా ఉంది.. ఎవరీ IPS!
గిరిజన కుంభమేళా మేడారంలోనూ ఓ మోనాలిసా మెరిసింది. ఆమె ఓ ఐపీఎస్ ఆఫీసర్ కావడం విశేషం. సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆమె స్టెప్పులు వేయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కుంభమేళ జాతరలో ఓ మోనాలిసా మెరిసిన సంగతి తెలిసిందే. పూసలమ్మే యువతి అందరి దృష్టిని ఆకర్షించడంతో రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ఆమె అందానికి ఫిదా అయిన సోషల్ మీడియా ఆమెకు మోనాలిసా అంటూ బిరుదు ఇచ్చింది. తరవాత యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాకుండా ప్రధాన మీడియా ఛానల్స్ సైతం ఆమె వెనుక ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. అయితే ఇప్పుడు గిరిజన కుంభమేళా మేడారంలోనూ ఓ మోనాలిసా మెరిసింది. ఆమె ఓ ఐపీఎస్ ఆఫీసర్ కావడం విశేషం.
సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆమె స్టెప్పులు వేయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేడారంలో అందమైన ఐపీఎస్ ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరీ ఆఫీసర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ నెటిజన్లు తెగ వెతుకున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఆ అధికారిణి పేరు వసుంధర యాదవ్. ప్రస్తుతం ఈమె ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. 2023 బ్యాచ్‌కు చెందిన వసుంధర యాదవ్ సొంతరాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కాగా అక్కడ నుండి 2024లో తెలంగాణకు బదీలీపై వచ్చారు.
వసుంధర యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజయ్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 2025లో లక్నోలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం అజయ్ యాదవ్ కూడా తెలంగాణలోనే కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పూసలమ్మే మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అవ్వడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం సినిమా అవకాశాలు సైతం దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. మరి మేడారం మోనాలిసాగా వైరల్ అవుతున్న ఐపీఎస్ అధికారిణి వసుంధర యాదవ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.






