Central Minister: తెలంగాణ స్కిల్​యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేం

by Gantepaka Srikanth |
Central Minister: తెలంగాణ స్కిల్​యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్​రెడ్డి స్కిల్​యూనివర్సిటీ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని ఎంపీ తెలిపారు.

అయితే ఇందుకోసం తగిన నిధులు సమకూర్చే ప్రతిపాదన ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందా? అని ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ చామల ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రమంత్రి జయంత్ చౌదరి.. స్కిల్ యూనివర్సిటీకి తాము నిధులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే స్కీమ్​ఏదీ కూడా కేంద్రం పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇతర స్కీమ్ల ద్వారా క్రెడిబిలిటీ కలిగిన సంస్థలకు సహకారం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

Next Story

Most Viewed