- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: కొండా సురేఖ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూల స్పందన
అటవీ శాఖకి సంబంధించిన అంశాల్లో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) విజ్ఞప్తులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: అటవీ శాఖకి సంబంధించిన అంశాల్లో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) విజ్ఞప్తులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని రహదారుల (LWE Roads) అనుమతులు, అర్బన్ ఫారెస్ట్రీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ అనుమతులకి సంబంధించి పర్మిషన్లు అడగగా.. కేంద్రమంత్రి పాజిటివ్‌గా రియాక్ట్ అయినట్లు కొండా సురేఖ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. అర్బన్ పార్కుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బృందం పలువురు కేంద్రమంత్రులను కలిసింది. భూపేందర్ యాదవ్‌తో పాటు కుమారస్వామితో భేటీ అయ్యారు. రిజినల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి అటవీశాఖకు సంబంధించి పర్యావరణ అనుమతులు కేంద్ర ఇవ్వాల్సి ఉన్నది. వీటికి సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేయాలని భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ కోరగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఉక్క పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు, అలాగే భారీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహాల కోసం కేంద్రం పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం కోరినట్లు సమాచారం.
అటవీ శాఖకి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తులకి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @byadavbjp గారి సానుకూల స్పందన.
— Konda Surekha (@iamkondasurekha) January 16, 2025
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని రహదారుల (ఎల్ డబ్ల్యూఈ రోడ్స్) అనుమతులు, అర్బన్ ఫారెస్ట్రీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో… pic.twitter.com/caFzagQqYX






