ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబసభ్యులకు ఫోన్‌

by Ramesh Goud |

మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో హైదరాబాద్ వాసుల (Hyderabad Citizens) రోడ్డు ప్రమాద (Road Accident) ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విచారం వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబసభ్యులకు ఫోన్‌
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో హైదరాబాద్ వాసుల (Hyderabad Citizens) రోడ్డు ప్రమాద (Road Accident) ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు తెలంగాణ (Telangana)కు చెందిన వ్యక్తులు మృతి (Dead) చెందిన ఘటనపై దిగ్భ్రాంతి (Shock) వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

అలాగే ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో (Madhyapradesh Government Officials) మాట్లాడి.. మృతుల కుటుంబాలకు (Died Family Members) అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స(Treatment) అందించాలని సూచించినట్లు తెలిపారు. ఇక రంగారెడ్డి (Rangareddy), మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా (Medchal Malkajgiri District)ల కలెక్టర్ల (Collectors)తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించానని వివరించారు. అంతేగాక బాధిత కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి భరోసా కల్పించడం జరిగిందని కేంద్రమంత్రి వెల్లడించారు. కాగా హైదరాబాద్ నాచారం నుంచి కొందరు భక్తులు ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మిగిలిన వారికి గాయాలు కాగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Next Story