- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పొన్నం లేఖకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందన.. IDTRపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ లోని వివిధ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ లోని వివిధ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ పంపిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్(IDTR) ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీ రియాక్ట్ అయ్యారు. 2.5 కోట్ల జనాభాకు ఒక ఐడీటీఆర్‌కి మాత్రమే అర్హత కలిగి ఉంటుందని, ఇప్పటికే కరీంనగర్ లో ఐడీటీఆర్ పనిచేస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(RDTCS), ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (DTS) కోసం రాష్ట్రం అర్హత సాధించిందని శుభవార్త చెప్పారు. వీటి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపవచ్చని స్పష్టం చేశారు. ఆటోమేటిక్ స్టేషనులకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం గ్రాంట్ అందిస్తుందని, జిల్లాకి రూ.1.50 కోట్లు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కేంద్ర మంత్రికి గతంలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నేషనల్ హైవేలు లాంటి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి మంత్రి పొన్నం లేఖ రాశారు.






