- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అమిత్ షా హామీ ఇచ్చారు’.. కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
by Gantepaka Srikanth |
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వదరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వదరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ట్వీట్ చేశారు. ‘భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపాల్సిందిగా కోరాను. ఇప్పటికే NDRF బృందాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని, అవసరమైతే అదనపు బృందాలను కూడా పంపుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో నదీ తీరాల్లోని గ్రామాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నాను. వరద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ బీజేపీ(Telangana BJP) కార్యకర్తలు ముందుండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి ట్వీట్‌లో పిలుపునిచ్చారు.
Next Story






