ఒక్క దాడికి మీరు పాల్పడితే.. వందరెట్ల ప్రతిదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.. పాకిస్తాన్‌కు కిషన్ రెడ్డి హెచ్చరిక

by Gantepaka Srikanth |

పాకిస్తాన్‌(Pakistan)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భారత్‌పై పాక్ మరోసారి దాడికి యత్నిస్తే.. వందరెట్ల ప్రతిదాడి తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.

ఒక్క దాడికి మీరు పాల్పడితే.. వందరెట్ల ప్రతిదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.. పాకిస్తాన్‌కు కిషన్ రెడ్డి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌(Pakistan)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భారత్‌పై పాక్ మరోసారి దాడికి యత్నిస్తే.. వందరెట్ల ప్రతిదాడి తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఇంట్లోకి చొరబడి కొడతాం.. పాక్ వంకరబుద్ధి తోక కత్తిరించి తీరుతామని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించారని తెలిపారు. తాము తాముగా ఎవరి జోలికి వెళ్లబోమని.. మా జోలికి వస్తే మాత్రం ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. కాగా, గతంలో మోడీ కూడా పాక్‌కు ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చారు. సిందూరం గన్‌ పౌడర్‌గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు.. సిందూరమని’ భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టారంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్‌ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గాం ముష్కరదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా 22 నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లు చెప్పారు.

Next Story