‘తెలంగాణకు అన్యాయం జరగడానికి వీళ్లేదు’.. బనకచర్ల విషయంలో CM రేవంత్‌కు కిషన్ రెడ్డి కీలక సలహా

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణకు అన్యాయం జరగడానికి వీళ్లేదు’.. బనకచర్ల విషయంలో CM రేవంత్‌కు కిషన్ రెడ్డి కీలక సలహా
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో లేఖ రాయాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరగడానికి వీళ్లేదని తేల్చి చెప్పారు. గత వారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది. కేంద్రం ఇంకా ఆ నివేదికను పరిశీలించలేదు. ఆవేమీ తెలుసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం పెద్దన పాత్రలో ఉంది కాబట్టి.. ఇరువైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఒకరికి అన్యాయం, మరొకరికి న్యాయం చేసేలా కేంద్రం వైఖరి ఎప్పుడూ ఉండదు. కేంద్రం ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుందని అన్నారు.

మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ - పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితర అంశాలన్నీ అనుకున్న సమయానికి జరగాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సైతం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆయన వివరించారు.

Next Story