- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉపాధ్యాయులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక పిలుపు
యోగా డే(Yoga Day)ను హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: యోగా డే(Yoga Day)ను హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పష్టం చేశారు. సోమవారం అధికారులతో అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మోగా డేలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారని తెలిపారు. వన్ డే కౌంట్‌డౌన్ కింద ఎల్బీ స్టేడియంలో ముందు రోజే యోగా డే నిర్వహిస్తున్నామని అన్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. మనిషి ఉల్లాసంగా ఉండేందుకు యోగా చాలా అవసరమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ ఉపాధ్యాయుడూ(Telangana Teachers) యోగాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని అధికారులను కోరారు. యోగాడేలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, శిక్షణ పొందిన అందరికీ యోగా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.






