- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాంగర్ బస్తీలో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బస్తీలో వరదలకు గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

మాంగర్ బస్తీలో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- బస్తీలో వరదలకు గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
- స్థానికులతో మాట్లాడిన కేంద్రమంత్రి సమస్యను పరిష్కరిస్తామని హామీ
దిశ,కార్వాన్ : ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వర్షాల నేపథ్యంలో వరద కారణంగా నాంపల్లిలోని మాంగారి బస్తీలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు కావడం బాధాకరమైన విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకకపోవడం మరింత బాధాకరమైన విషయమని అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ అధికారుల బృందంతో పాటు మంగర్ బస్తీ అఫ్జల్ సాగర్ నాలాను సందర్శించి గల్లంతైన అర్జున్, రామ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వారి ఆచూకీ కోసం కమీషనర్ తో సహా స్థానిక అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై జిహెచ్ఎంసి కమిషనర్ తో సంబంధిత అధికారులతో మాట్లాడుతూనే ఉన్నామని తెలిపారు. మరోవైపు ఈ వరద నియంత్రణకు సంబంధించిన స్థానిక బస్తీ ప్రజలతో చర్చించి నాలా డైవర్షన్ పై ఓ వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించునున్నారు. పూడిక తీయాల్సి ఉందిని తెలిపారు. స్థానిక నాయకులతో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగజయంతి తో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.






