- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందువు దేవుళ్లను సీఎం రేవంత్ అవహేళన చేయడం అహంకారమే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
హిందువులను దేవుళ్లను అవహేళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హిందువులను దేవుళ్లను అవహేళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక హిందువుగా ఉంటూ, హిందువులపై , దేవీ దేవతల మీద ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో పేర్కొంటూ.. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ మాట్లాడారని గుర్తు చేశారు.
మజ్లిస్ సహవాస దోషంతో హిందువుల మీద, దేవీ దేవతల మీద బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కూడా హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందువుల శక్తి ఏంటో రేవంత్ రెడ్డికి, యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ ఓట్లతో అధికార పీఠమెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారో, ఆ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీకి పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలి. అధికార పీఠం నుంచి దించేయాలి. అందుకు తెలంగాణలోని హిందువులంతా సిద్ధం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.






