- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy : డీఎంఎఫ్‌తో ప్రజలకు నేరుగా లాభాలు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రధాని మోడీ విజన్‌కు అనుగుణంగా మన దేశ ఖనిజ సంపద ప్రజల సమగ్ర, దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని, రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్ మంత్రాన్ని ప్రతి స్థాయిలో ఆచరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ విజన్‌కు అనుగుణంగా మన దేశ ఖనిజ సంపద ప్రజల సమగ్ర, దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని, రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్ మంత్రాన్ని ప్రతి స్థాయిలో ఆచరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో డీఎంఎఫ్ వర్క్ షాప్ ముగింపు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు డీఎంఎఫ్కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 కు పైగా జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ఉన్నాయి. డీఎంఎఫ్‌లను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంతో అనుసంధానం చేసి, మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, తాగునీరు, ఉపాధి కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించారు.
మైనింగ్ రంగంలో ఉత్తమ విధానాల గురించి ఆలోచనలను పంచుకున్నామని, వాటిని జిల్లా స్థాయిలో బలోపేతం చేసి నిధులు సమయానికి విడుదల కావాలి, అనుమతులు వేగంగా ఇవ్వాలి, పర్యవేక్షణ నిరంతరం, సమర్థవంతంగా ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను డీఎంఎఫ్ భాగస్వామ్యం చేసి, సాంకేతికను సమర్థవంతంగా వినియోగించాలి.. దాని ఫలితాలపై దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.






