- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో చారిత్రాత్మక మార్పు.. 2070 నాటికి నెట్ జీరో టార్గెట్ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో చారిత్రాత్మక మార్పు వచ్చిందని, పారదర్శకమైన సాంకేతిక ఆధారిత పరిపాలన అందిస్తూ కొత్త ప్రమాణాలతో ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో చారిత్రాత్మక మార్పు వచ్చిందని, పారదర్శకమైన సాంకేతిక ఆధారిత పరిపాలన అందిస్తూ కొత్త ప్రమాణాలతో ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్ 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో కేంద్రం ఉందని, ఈ ప్రయాణంలో డీప్ టెక్నాలజీ ఎంతో కీలకంగా మారుతుందన్నారు. ఏఐ వినియోగం, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, కార్బన్ క్యాప్చర్, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ఆవిష్కరణలు అత్యంత అవసరమని తెలిపారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. సీవీ రామన్ ప్రపంచానికి రామన్ ఎఫెక్ట్‌ను పరిచయం చేసినప్పుడు, భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ, మేధోశక్తి విషయంలో భారత్ ఒక స్వతంత్ర దేశమని ఎప్పటికీ అలాగే నిలుస్తుందని నిరూపించారు. నేడు విజ్ఞాన రంగంలో భారతదేశంపై చేయి సాధించిన విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇటీవల గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో ప్రతినిధులంతా భారతదేశ విస్తృత స్థాయి, ప్రతిభ, భవిష్యత్తు గురించి చర్చించుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధి భారత్ భాగస్వామ్యంలోనే ముందుకు సాగుతుందనే విషయాన్ని వారు గుర్తించారు. గత 11 ఏళ్లలో భారతదేశం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో ఒక శక్తిమంతంగా నిలిచిందని ప్రశంసలు కురిపించినట్లు తెలిపారు.
ప్రజలకు ఆహారం అందించడం కష్టం!
విజ్ఞానం అనేది లేకుండా 1.4 బిలియన్ ప్రజలకు ఆహారం అందించడం కష్టం అని కేంద్ర మంత్రి అన్నారు. పరిశోధనలు లేకుండా రక్షణ రంగం మన సరిహద్దులను కాపాడలేం.. ఆవిష్కరణలు లేకుండా పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో పోటీ పడలేమన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని పిల్లర్లు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల భుజాలపై ఆధారపడి ఉన్నాయని, అంతరిక్షంలోకి మనం పంపిన అనేక మిషన్లు ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.. మన ఔషధ, వ్యాక్సిన్ సామర్థ్యాలు మానవాళికి సేవ చేయగలవని నిరూపించాయి.. వికసిత భారత్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో విజ్ఞానం, సాంకేతికతే మన భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.. నేటి యువత పరిశోధనలపై దృష్టి సారించేలా విద్యా సంస్థలు పరిశ్రమలతో భాగస్వామ్యం కావడంతో పాటు, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇండియా ఏఐ మిషన్ కింద భారత్‌ను సంసిద్ధం చేయడానికి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ కూడా ఈ మార్పును ప్రతిబింబిస్తోంది.. సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలో రూ. 200 కోట్లకు పైగా వ్యయంతో ప్రపంచ స్థాయి సైన్స్ సిటీ నిర్మాణంలో ఉందన్నారు.. క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం ఏర్పాటైన 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఐఐటీ హైదరాబాద్, నాన్ ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్లు తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.






