- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను టచ్ చేసే వ్యక్తి ఇంకా పుట్టలేదు: CM రేవంత్‌పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, తెలంగాణ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. మెట్రోరైలు కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. "మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే మేం రాజీనామా చేయడానికి సిద్ధం. మరి ఎన్నికల హామీలను అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా?" అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. ఎవరు రాజీనామాకు సిద్ధమో తేల్చుకోవాలన్నారు.
నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు..
నన్ను తెలంగాణ నుంచి తరిమికొడతానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తనను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. "నన్ను తరిమికొట్టే వ్యక్తి ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదు. నేనేమీ బీఆర్ఎస్ కార్యకర్తను కాదు.. కరడుగట్టిన బీజేపీ కార్యికర్తను" అని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, లోపాయికారీ ఒప్పందాలతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.






