బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అలా ఉంటే బాగుంటుంది.. మనసులోమాట బయపెట్టిన కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు.

బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అలా ఉంటే బాగుంటుంది.. మనసులోమాట బయపెట్టిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసమే బీజేపీ(BJP) పనిచేస్తుందని చెప్పారు. నిజామాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా పసుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది రైతుల కోసం చేసే కార్యక్రమం అని అన్నారు. రేవంత్ రెడ్డి కోసమో, కాంగ్రెస్(Congress) పార్టీ కోసమో తాము పనిచేయబోమని సీరియస్ అయ్యారు. గతవారం మెట్రో డీపీఆర్(Metro DPR) కేంద్రానికి ఇచ్చారు. సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుంది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

జులై 1న రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన

జులై 1వ తేదీన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేపు బన్సల్, శోభాకరం సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారు. అయితే.. రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని భావించిన బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అధ్యక్షుడిగా ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లు ప్రధాన పోటీదారులుగా ఉన్నట్లు సమాచారం. మహిళల్లో ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తున్నది. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

Next Story