Kishan Reddy: వన్‌ నేషన్ - వన్ ఎలక్షన్‌తో ఈ పరిస్థితి ఉండేది కాదు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

Kishan Reddy: వన్‌ నేషన్ - వన్ ఎలక్షన్‌తో ఈ పరిస్థితి ఉండేది కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఢిల్లీలో దిక్కు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. వన్‌ నేషన్, వన్ ఎలక్షన్‌తో ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు.

దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వన్ నేషన్.. వన్ ఎలక్షన్(One Nation.. One Election) ఈజీగా ఉంటుందని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ(Delhi)లోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Next Story