- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కాంగ్రెస్ గెల్చిన.. BRS గెల్చిన ఆర్థిక విధ్వంసమే: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి మరోసారి మోసపోవద్దని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి మరోసారి మోసపోవద్దని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కలాగా కూర్చుని వేచి చూస్తున్న కాంగ్రెస్ మాయలో ప్రజలు పడొద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు బహిష్కరించాలని, ఓటుతో ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నాయనే విషయాన్ని ప్రజలంతా గుర్తించారన్నారు. బీజేపీని ఎవరికీ బీ టీమ్‌గా ప్రజలు గుర్తించలేదని, ఏ టీమ్‌గానే ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఆదరించారన్నారు.
ఆత్మవిశ్వాసంతో ఒక నిశబ్ద విప్లవంతో బీజేపీకి ఓటు వేయబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. వచ్చేనెల 3వ తేదీన బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రాజకీయ అవగాహన లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మజ్లీస్ బీజేపీ కనుసైగల్లో పని చేస్తుందని రాహుల్ విమర్శిస్తున్నారని, అసలు మజ్లిస్‌ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి ఫైరయ్యారు. దారుసలాంను మజ్లీస్‌కు కట్టబెట్టింది కాంగ్రెస్సేనని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ దారుసలాంను సందర్శించారని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో మజ్లీస్ పార్టీ గుండాయిజం, అరాచకాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మజ్లీస్ గుండాయిజాన్ని సమర్థించేది లేదని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుందన్నారు. తెలంగాణతో రాజకీయ సంబంధం, రక్త సంబంధం ఉందని కాంగ్రెస్ చెబుతోందని, ఉద్యమకారులను కాల్చి చంపి రక్తం చిందించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.






