పిలువగానే చిరంజీవి వస్తారు! ఈటలకు ఆ నిబంధన వర్తించదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Ramesh Naini |   (  Updated:2025-06-15 09:16:40  IST  )

మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.

పిలువగానే చిరంజీవి వస్తారు! ఈటలకు ఆ నిబంధన వర్తించదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాకు ప్రధాన ప్రత్యర్థి (Congress) కాంగ్రెస్.. అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ఎవడో పనికి రాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా? అని మండిపడ్డారు. కుటుంబ , అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక ఇష్యూల ఎజెండా గానే ఎన్నికలకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి వివరిస్తామన్నారు.

బీజేపీలో తర్వాత అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ (BRS) వాళ్ళు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్‌లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయని, బీజేపీలో అలా కాదని విమర్శించారు. బీజేపీ మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీలు ఉన్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తి కాగానే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండో సార్లు క్రియాశీల సభ్యుడు అయ్యి ఉండాలి.. సీనియర్ నాయకులు (Eatala Rajendar) ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారని, ఆ నిబంధన ఆయనకు వర్తించదని స్పష్టం చేశారు.

ఎవరైనా వస్తారంటే పార్టీలోకి పిలిచేందుకు సిద్ధం.. నా మాట కాదనకుండా పిలువగానే (Chiranjeevi) చిరంజీవి వస్తారు.. అని మనసులో మాట చెప్పారు. అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీకి సంబంధాలు ఉన్నాయని (విజయశాంతి, కోట శ్రీనివాస రావు, కృష్ణం రాజు, ఎస్ జానకి సుమన్, నరేష్ లాంటి వాళ్ళు) తెలిపారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని గుర్తుకు చేశారు. ఉచితాలకి బీజేపీ వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు ఉండాలని అంటున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని కి నిధులు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టం లో ఉందని, దాని ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందన్నారు. టెక్స్టైల్ ప్రాజెక్ట్ , జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ , పసుపు బోర్డు తెచ్చింది మేమే.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మా వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్నారని, ఇవి గతం లోనే ప్రకటించామన్నారు. మా వల్లనే వచ్చిందని అంటున్న వారిని ఈడ్చి కొట్టాలని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని, హైదరాబాద్ మెట్రో నెక్ట్స్ ఫేజ్‌కి కేంద్రం సహకారం అందిస్తుందని గుర్తుకు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ దేశ వ్యాప్తంగా ఒక నేతగా ఎదగాలి అని అనుకుంటున్నారని అన్నారు. బీజేపీ ఓడించేందుకు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తో కలిసి పని చేస్తుందని చెప్పారు. ఓవైసీ పిట్టల దొరగా మాట్లాడుతారు అని ముస్లిం నేతనే కామెంట్ చేశారని విమర్శించారు.

Next Story