తెలంగాణ గ్లోబల్​సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

by Gantepaka Srikanth |

తెలంగాణ గ్లోబల్​సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హాజరు

తెలంగాణ గ్లోబల్​సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తుందన్నారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి హాజరవుతారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Next Story