- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంతో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి భేటీ.. స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రశంసలు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి (Jayanth Chowdary) మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి (Jayanth Chowdary) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ‘కౌశల్ మందన్’ (Kaushal Mandan) కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఆయన ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే స్కిల్ యూనివర్సిటీ గురించి సమగ్రంగా వివరించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా.. లాజిస్టిక్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో వారు నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ఆ స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ (Telangana)లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు.






