- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ చైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఆ విషయంలో విజ్ఞప్తి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కరీంనగర్‌లో టీటీడీ (TTD) ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించడానికి సహకరించాలని (Union Minister బండి sanjay) కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన (Tirumala Tirupati Devasthanams board Chairman BR. Naidu) తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడుకి బండి సంజయ్ లేఖ రాశారు. గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడిన ఓ ముఖ్యమైన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు. 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్‌లో పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని పేర్కొన్నారు. 2023 మే 31న రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల సమక్షంలో భూమి పూజ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వివరించారు.
ప్రస్తుతం మీ నేతృత్వంలో టీటీడీ దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్దికి సహకరిస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని వెల్లడించారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను మీరు ఆదుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో దేవాలయాన్ని నిర్మించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక, ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చూడబోతోందని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో భక్తులంతా భక్తిపూర్వకంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి, దివ్య కృపను పొందేందుకు ప్రేరణనిస్తుందని వెల్లడించారు. మీరు ఇప్పటికే చేపట్టిన కొన్ని మంచి చర్యలు భక్తుల నుంచి విశేషమైన ప్రశంసలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.






