- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాస్వామ్యం కళ్లముందే హత్యకు గురవుతోంది: పార్టీ ఫిరాయింపులపై బండి సంజయ్ ట్వీట్
తెలంగాణలో ప్రజాస్వామ్యం కళ్లముందే హత్యకు గురవుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజాస్వామ్యం కళ్లముందే హత్యకు గురవుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేయడంతో వారు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గురువారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్నే ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. ఈ బిల్లు నిన్నే కాదు, గత ఏడాదే కాదు, ఏడు సంవత్సరాల ముందే రావాల్సింది, ఎందుకంటే అప్పటికే నష్టం చాలా లోతుగా జరిగింది అని రాజీవ్ గాంధీ మాటలను బండి సంజయ్ గుర్తుచేశారు. దశాబ్దాలు గడిచినా, ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన సమయంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారు అని పేర్కొన్నారు. ప్రజల్లో రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో మాత్రం దానినే హతమార్చారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి.. జైపాల్ రెడ్డి వారసత్వం గురించి మాట్లాడటం మరింత నిస్సిగ్గుతనమని బండి సంజయ్ విమర్శించారు. జనతా పార్టీ తరఫున మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న జైపాల్ రెడ్డి, పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌కు అధికారం ఇవ్వడం వల్ల అది పాలక వర్గానికి అపారమైన శక్తిని ఇస్తుంది అని అప్పుడే హెచ్చరించారని ఆయన గుర్తుచేశారు. ఆ హెచ్చరిక అక్షరాలా నేడు తెలంగాణలో నిజమైందని అన్నారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ తమ తమ రాజకీయ వారసత్వాలను నిలబెట్టుకోలేకపోయారని, ప్రజల ఆశలను మరింతగా ద్రోహం చేశారని బండి సంజయ్ విమర్శించారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పవిత్రత నటించడం హాస్యాస్పదమని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను సంస్థాగతంగా ప్రోత్సహించారని, రేవంత్ రెడ్డి అదే సంస్కృతిని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు.. అని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కలిసి ప్రజాస్వామ్యాన్ని హతమార్చి, పార్టీ ఫిరాయింపు దారులను కాపాడారని ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ట్వీట్ ఇదే..






