గీతా జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేశం ఇదే..

by Ramesh Naini |

హిందూ సమాజం ఆచరించే ప్రధాన పర్వదినాల్లో గీతా జయంతి ఒకటి.

గీతా జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేశం ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ సమాజం ఆచరించే ప్రధాన పర్వదినాల్లో గీతా జయంతి ఒకటి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున జయంతిని జరుపుతారు. (డిసెంబర్ 1) ఈ రోజును పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గీతా జయంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌లో భగవద్గీతను ‘ధర్మమే జీవితం, కర్మను ఆచరించడమే కర్తవ్యం అని ఉపదేశించే దివ్య గ్రంథం’గా అభివర్ణించారు. మనలోని మలినాలను తొలగించి, మనిషిని ఉన్నత మనిషిగా తీర్చిదిద్దే జ్ఞాన గంగా భగవద్గీత అని పేర్కొన్నారు.

అలాగే భగవద్గీత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మానవ వికాస మార్గం అని తెలిపారు. ‘గీత మనిషి నుదుటిపై రాతను మార్చే జ్ఞానఘని.. ఆత్మతత్వాన్ని బోధించే అమృతధుని’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా హిందూ భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ ధర్మ మార్గంలో నడుస్తూ కార్యోన్ముఖులుగా ముందుకు సాగాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ట్వీట్ ఇదే..

Next Story