- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ నోటీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కేంద్ర మంత్రి బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని కామెంట్ చేశారు. చివరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు అంటూ బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్‌ఐబీ (SIB) వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు.
ఎస్‌ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అనేది అనుమానమేనని పేర్కొన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారే తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసు విచారణ చేపడుతున్న అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వాళ్లకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. బడా పారిశ్రామికవేత్తలను, లీడర్లను, వ్యాపారాలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు చేసిన వ్యవహారంపైనా నిగ్గు తేల్చాలన్నారు. అసలు ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.






