'అన్నపూర్ణ పథకం' పేరు మార్పు.. హిందూ విశ్వాసాలకు అవమానం : బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

రూ.5 మిల్స్ పథకం అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ‘ఇందిరా క్యాంటిన్’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ పథకం పేరు మార్పు.. హిందూ విశ్వాసాలకు అవమానం : బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ.5 మిల్స్ పథకం (Annapurna Meal Scheme) అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ‘ఇందిరా క్యాంటిన్’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే.. అని విమర్శించారు. ‘విశ్వవిద్యాలయాలు పేరు మార్చింది, ఆసుపత్రులు, నీటిపారుదల ప్రాజెక్టులు, అవార్డుల పేరు,ఫ్లైఓవర్ల పేరు, గృహ నిర్మాణ పథకం పేరు, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాల పేరు, హరితహారం కార్యక్రమం పేరు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు, తెలంగాణ తల్లి మారింది’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం వారు సిగ్గులేకుండా రూ.5 భోజన పథకాన్ని దైవిక దాత అన్నపూర్ణ దేవత నుంచి ఇందిరా గాంధీగా మార్చారని పేర్కొన్నారు. ఇది పాలన కాదు.. ఇది హిందూ విశ్వాసాలకు అవమానం.. అని ఆరోపించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పేదల ఆకలిని తీర్చేందుకు రూ.5 తో 'అన్నపూర్ణ భోజన పథకం' పేరిట స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్‌ను ఇందిరా క్యాంటీన్‌గా పేరు మార్చుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే లభించేది. కానీ ప్రస్తుతం కొత్త నిర్ణయం ప్రకారం ఉదయాన్నే టిఫిన్ కూడా అందించనున్నారు. ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లు కేవలం రూ.5కే అందించనున్నట్లు స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Next Story