- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలతో ప్రభుత్వం ఆడుతున్న ఫుట్‌బాల్ కనిపించట్లేదా? రాహుల్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే వస్తానని చెప్పిన రాహుల్ గాంధీ, ఆ నిమిషం మాత్రం లగ్జరీ టైమ్ జోన్‌లో నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే వస్తానని చెప్పిన రాహుల్ గాంధీ, ఆ నిమిషం మాత్రం లగ్జరీ టైమ్ జోన్‌లో నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలకు రాహుల్ గాంధీ గడియారం పనిచేయదని, అది కేవలం వీఐపీ కార్యక్రమాలు, ఫోటో షూట్స్‌కే టిక్‌టిక్ మంటుందని తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల బాధలకన్నా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికే రాహుల్ గాంధీకి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ‘మీరు ఫుట్‌బాల్ చూడటానికి వచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుతున్న రాజకీయ ఫుట్‌బాల్ కనిపించడం లేదేమో’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్లు కూల్చివేయడం, విద్యార్థులు ఆహార విషబాధతో ప్రాణాలు కోల్పోవడం, రైతులు, నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంటే నాయకత్వం మౌనంగా ఉందని బండి సంజయ్ విమర్శించారు. పెన్షన్లు ఇంకా చెల్లించకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం, బహిరంగంగానే కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పగటిపూటే హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని, ఆలయాల కూల్చివేతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. ‘ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు గైర్హాజరు. గందరగోళం ఉన్నప్పుడు సెలవుల్లో. కానీ స్పాట్‌లైట్ ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా హాజరవుతారు అంటూ రాహుల్ గాంధీపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తానని రాహుల్ హామీ ఇచ్చిన వీడియో పోస్ట్ చేశారు. ట్వీట్ ఇదే..






