Bandi Sanjay: మావోయిస్టులతో చర్చలు ఉండవ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

‘ఆపరేషన్ కగార్’ నిలిపివేసి (Maoists) మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Bandi Sanjay: మావోయిస్టులతో చర్చలు ఉండవ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ఆపరేషన్ కగార్’ నిలిపివేసి (Maoists) మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ (Union Minister Bandi Sanjay) స్పందించారు. ఆదివారం కరీంనగర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మావోయిస్టులతో చర్చలకు ప్రసక్తే లేదన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్ అని తేల్చి చెప్పారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుకు చేవారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతో సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి నక్సల్స్ చంపారని మండిపడ్డారు. అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు అని ఫైర్ అయ్యారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని, ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా నక్సల్స్‌తో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, మోడీ కులగణన సర్వేకు పొంతన?

కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైనదని, ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం అని విమర్శించారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోడీ కులగణను పొంతనే ఉండదని తెలిపారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల జనాభాను తగ్గించి చూపారని ఆరోపించారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని, 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని స్పష్టం చేశారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని సూచించారు. అలాగే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బండి సంజయ్ నిలదీశారు.

Next Story