- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాస్వామ్యాన్ని శాసన వ్యవస్థే ఖూనీ చేస్తోంది : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటిషన్ ను అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడం అత్యంత దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు....

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్ ను అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్డిస్మిస్ చేయడం అత్యంత దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమోశాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపం అవుతుందన్నారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టిక్కెట్ పై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గు చేటు అన్నారు.
గాంధీభవన్‌లో సంసారం చేస్తూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేటుగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పిపారని ఈఅంశంపై ఆయన స్పందించాలని డిమాండ్‌చేశారు. శాసన వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని, స్పీకర్ స్వతంత్ర్యంగా వ్యవహరించాలలని డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించ కూడదని హితువు పలికారు.
ఈ అంశంపై దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా స్పందించాలని పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేమన్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళతామని, న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. బెంగాల్ లో అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టేసిందని, తెలంగాణలో ఫిరాయింపులపై చెంప చెళ్లుమనేలా న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.






