- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌదీ బస్సు ప్రమాదం.. స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్
by Naga Rani Yarlagadda |
సౌదీ అరేబియాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ లోని మల్లేపల్లికి చెందిన 9 మంది కుటుంబ సభ్యుల్లో ఒకే ఒక్కడు మాత్రమే గాయాలతో ప్రమాదం నుంచి బయయపడగా ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు.
అధికారిక సమాచారం ప్రకారం సౌదీ ప్రమాదంలో మరణించినవారిలో 18 మంది భారతీయులున్నట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు హోంమంత్రి అమిత్ షా సౌదీ సర్కారుతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story






